

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరిగిన ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ వి. ప్రణవ్ స్వర్ణ పతకం సాధించాడు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల ప్రణవ్ 13 రౌండ్లలో 10.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. టోర్నీ ఆరంభం నుంచే ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అద్భుతమైన ఆటతీరుతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ పోటీల్లో కిర్గిస్థాన్‌కు చెందిన ఎల్డియార్ ఒరోజ్‌బెవ్ రెండో స్థానంలో నిలవగా, అర్మేనియాకు చెందిన రాబర్ట్ ఫిలిపోస్యాన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే టోర్నీలో జరిగిన ర్యాపిడ్ విభాగంలోనూ ప్రణవ్ రాణించి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది ఫిడే ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన ప్రణవ్, తాజాగా మరో అంతర్జాతీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!