
సినిమాలు

అక్కినేని నాగార్జున, గిరిజ శెట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గీతాంజలి’ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాసిక్ ప్రేమకథను ఆగస్టు 28న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇళయరాజా అందించిన మధుర సంగీతం, పి.సి. శ్రీరామ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, బి. లెనిన్, వి.టి. విజయన్ ఎడిటింగ్, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా నిలబెట్టాయి. భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ సంస్థ రీ-రిలీజ్ చేస్తోంది. భావోద్వేగాలు, ప్రేమతో నిండిన ఈ సినిమా మరోసారి పెద్ద తెరపై మెరిసేందుకు సిద్ధమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!