

ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సినిమా షూటింగ్‌లో భుజానికి గాయం కావడంతో గత కొన్ని వారాలుగా కెమెరాలకు, ప్రమోషన్లకు దూరంగా ఉన్న తారక్.. కోలుకున్న తర్వాత మళ్లీ బహిరంగ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో ఈ వేడుక జరగనుండగా, ఎన్టీఆర్ రాకను మేకర్స్ ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించారు. తెలుగు ట్రైలర్‌కు నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించారు. ఇందులో ఫహద్ వీధి మాంత్రికుడి పాత్రలో కనిపించగా, అతడి జీవితంలోకి అతీంద్రియ శక్తులు ఉన్న ఓ చిన్నారి రావడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఈ ఫాంటసీ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!