

కన్నడ చిత్రం ముగిల్‌పేటతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కాయదు లోహార్, ఆ తర్వాత అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటన పరంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగులో వరుస అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన ఫంకీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, నాని నటించిన ది పారడైజ్‌పై ఆమెకు అంచనాలు నెలకొన్నాయి.
ది పారడైజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సినిమాలో కాయదు పోషించిన పాత్రపై కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. తండ్రి అప్పులు తీర్చేందుకు బి-గ్రేడ్ సినిమాల్లో నటించే పాత్రలో ఆమె కనిపించడం కొంతమంది ప్రేక్షకులకు అసౌకర్యంగా అనిపించింది. ఈ పాత్రపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో కాయదు ఎలాంటి కథలు, పాత్రలను ఎంచుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!