
క్రీడలు

నందమూరి బాలకృష్ణ తన 66వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా ఆయన కొత్త చిత్రం ‘NBK111’ నుంచి యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్‌ను ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, గ్లింప్స్ విడుదలతో మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
గ్లింప్స్ విడుదలకు ముందు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీష్ కిలారు, సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్, సంగీత దర్శకుడు థమన్ బాలకృష్ణను వ్యక్తిగతంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినిమా గురించి చర్చించడంతో పాటు గ్లింప్స్‌కు సంబంధించిన అంశాలను ఖరారు చేసినట్లు సమాచారం. టీజర్‌లో సినిమా టైటిల్‌ను వెల్లడించకపోయినా, బాలయ్యను పూర్తిగా కొత్త స్టైలిష్ అవతార్‌లో చూపించనున్నట్లు చిత్రబృందం చెబుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!