

సోషల్ మీడియా స్టార్ నిహారిక ఎన్ఎమ్ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో నటిగా మెప్పించిన ఆమె, ఇప్పుడు రాఘవ్ జుయల్‌తో కలిసి నటించిన 'భాయ్ తేరా స్టార్ హై' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ, ఈ చిత్రంలో రష్మి అనే చలాకీ పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. దర్శకుడు వివేక్ అగర్వాల్ తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఇచ్చారని, రాఘవ్ జుయల్‌తో స్క్రిప్ట్ లేకుండానే చేసిన ఒక సన్నివేశం ఎంతో సహజంగా వచ్చిందని చెప్పారు.
సోషల్ మీడియాలో అత్యధిక గుర్తింపు, ఆదాయం వస్తున్న సమయంలో కంటెంట్ క్రియేషన్‌ను వదిలేయడం తన కెరీర్‌లో అత్యంత సాహసోపేత నిర్ణయమని నిహారిక వెల్లడించారు. నటిగా తనను తాను నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఒకవేళ విఫలమైనా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించగలననే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే మహేష్ బాబుతో హీరోయిన్‌గా నటించాలని ఎప్పటి నుంచో కల ఉందని, కానీ మొదట్లో తన చర్మరంగు కారణంగా కొంత సంకోచించానని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలో ప్రతిభకు ప్రాధాన్యం పెరగడం సంతోషకరమని, దక్షిణాది ప్రేక్షకులు తనను ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారని అన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!