

ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని, ఆ రోజున టీజర్ విడుదల కావడం లేదని చిత్ర నిర్మాత మైత్రీ నవీన్ స్పష్టం చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తారా అని ఓ విలేకరి అడగగా, దానికి బదులుగా అభిమానులను ఆకట్టుకునే మరో ఆసక్తికరమైన కంటెంట్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జె. ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజున టీజర్ విడుదల కాకపోయినా, అభిమానులను ఉత్సాహపరిచేలా ప్రత్యేక కంటెంట్‌ను తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!