

‘పెద్ది’ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, రామ్‌చరణ్ ఈ సినిమాలో నటించలేదని, ఆ పాత్రలో జీవించాడని అన్నారు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే స్థాయిలో నటించి, ‘పెద్ది’ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడని కొనియాడారు. ‘‘ఇక చిరంజీవి కాదు.. చరణ్జీవి’’ అంటూ తన గర్వాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు బుచ్చిబాబు గ్రామీణ నేపథ్య కథను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని, నిర్మాత సతీశ్ కిలారు కథను నమ్మి భారీ స్థాయిలో నిర్మించినందుకు అభినందనలు తెలిపారు. గాయాలైనా లెక్కచేయకుండా జిమ్‌లో కఠిన శిక్షణ తీసుకుంటూ, పాత్ర కోసం చరణ్ పడిన కష్టాన్ని గుర్తుచేశారు. తాము డబ్బు కోసం కాకుండా పని చేసే ఆనందం కోసం సినిమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ చిత్ర బృందాన్ని అభినందించగా, #RC17పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అభిమానుల్లో ఉత్కంఠను పెంచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!