

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో బోనాల వేడుకల్లో సందడి చేశారు. నగరంలోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి నాంపల్లిలోని శ్రీ ఏడు గుళ్ల పోచమ్మ, చార్మినార్ సమీపంలోని శ్రీ భాగ్యలక్ష్మి, బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి తదితర ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేటీఆర్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, హైదరాబాద్‌లో వ్యాపారాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!