17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ స్టార్ హీరో నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు - అజయ్ అరసాడ

Writer: Pooja 11:13 AM, 18 ఆగస్టు, 2026
ఆ స్టార్ హీరో నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు - అజయ్ అరసాడ

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతోన్న అజయ్ అరసాడ తన సినీ జర్నీని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.

మీ నేపథ్యం గురించి చెప్పండి?
మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్, టీసీఎస్‌లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నాడు.

చిన్న చిత్రాల్ని చేస్తుండటంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి?
చిన్న చిత్రాలకు పని చేయడం వల్ల నాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. మంచి ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎప్పుడూ కూడా పేమెంట్స్ విషయంలో తేడా రాలేదు. ఈ క్రమంలో నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాలేదు.

మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడాలని ప్రయత్నిస్తున్నారా?
అన్ని రకాల జానర్‌లు, కథల్ని చేయాలని అనుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తాను. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. తమిళ్ నుంచి వస్తే కొత్తగా ఇస్తాడు, మలయాళం నుంచి వస్తే ఫ్రెష్‌గా ఇస్తారని ఇక్కడ కొంత మంది నమ్ముతారు.

బడ్జెట్‌ను పట్టి మ్యూజిక్ మారుతుందా?
ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారు అని అనుకుంటే వారితోనే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్‌గా అది నా పాట. జీవితాంతం నిలిచే పోయే పాటగా ఉండాలని చూస్తాను. కెరీర్‌ స్టార్టింగ్‌లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తా అని అంటే ఓ నిర్మాత వద్దని అన్నాడు. ఇప్పుడు ఆ నిర్మాతే అనురాగ్‌తో పాడించుకునే స్థాయిలో లేడు (నవ్వుతూ).

థియేటర్‌ కోసం పని చేసినప్పుడు, ఓటీటీ కోసం పని చేసినప్పుడు ఉండే తేడా, మీకు కలిగే ఫీలింగ్ ఏంటి?
మేం థియేటర్‌కి సరిపోయేలా మ్యూజిక్, స్కోర్ ఇస్తాం. దాన్ని చివరకు ఓటీటీలోకి తీసుకు వస్తారు. అప్పటి వరకు మేం పడిన కష్టం వృథా అవుతుంది. ‘వికటకవి’ని ఒకవేళ థియేటర్‌లో చూస్తే సౌండింగ్ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఓటీటీకి వచ్చే సరికి నేను చేసిన యాభై శాతానికి పడిపోతుంది.

మ్యూజిక్ మీద ఏఐ ప్రభావం ఎంత వరకు ఉంటుంది?
మ్యూజిక్ మీద ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఏఐలో ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా కూడా ఒకేలా ఉంటాయి. కొంత మంది నిర్మాతలు ఏఐ నుంచి ట్రాక్స్ పంపి.. ఇలా కావాలని అంటారు. అలాంటప్పుడు మేం ఎందుకు మీరే కొట్టుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది (నవ్వుతూ). ఏఐని వాడి ఏ టెక్నీషియన్ అయినా పని చేయొచ్చు. కానీ ఏఐని వాడి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వొచ్చని మాత్రం అనుకోకూడదు (నవ్వుతూ).

రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏం మాట్లాడారు?
నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ ఇస్తాను. మొన్న మోదీ గారిని ఆయన కలిసినప్పుడు ఓ స్కోర్ చేశాను. నా వర్క్ చూసి ఆయన పిలిపించారు. ఆయనతో నాతో పర్సనల్‌గా మాట్లాడారు. పొలిటికల్‌గా అయినా సరే పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసమైనా సరే పని చేద్దామని ఆయన అన్నారు.

జన సేన కోసం ఎప్పటి నుంచి పని చేశారు? ఆ అవకాశం ఎలా వచ్చింది?
వెంకట్ చిక్కాల అనే నా మిత్రుడు అక్కడ ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. అలా నా ఫ్రెండ్ వల్ల ఆ అవకాశం వచ్చింది. బన్నీ వాస్ గారు కూడా నాతో చాలా వర్క్ చేయించారు. అక్కడి నుంచే నాకు ‘ఆయ్’ అవకాశం వచ్చింది.

మీరు బయట ఎక్కడా ఎందుకు కనిపించరు?
నాకు బయటకు వచ్చి నా పనితనం గురించి నేనే చెప్పుకోవడం నాకు నచ్చదు. నేను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడను. ఈవెంట్లలో కనిపించను. సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకోవడం అన్నది నాకు తెలియదు.

పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని చెప్పిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి?
నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నా. కానీ మళ్లీ ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ఓ ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగేసి వస్తానని అనుకున్నా. కానీ నేను వెళ్లే సరికి ఆయన ఒక్కరే ఉన్నారు. దాదాపు అరగంట మాట్లాడారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి ఆయన చెప్పారు.

మీ దగ్గర ఉన్న ఓ వస్తువు గురించి ఆయన అడిగారని తెలిసింది?
నా దగ్గర కాఫీ మగ్ షేప్‌లో ఉండే ఓ బోస్ స్పీకర్ ఉంటుంది. ఇదేంటి ఆయన అడిగారు. దాన్ని పట్టుకుని సరదాగా చూసుకుంటూ నవ్వారు. ఇదేంటి కాఫీ కప్పులా ఉందని కామెడీ చేశారు. కాఫీ పట్టుకొచ్చావా? అని జోక్స్ వేశారు. ఈయనేంటి? నాతో జోక్స్ వేస్తున్నారు అని అనుకుని లోలోపల సంబరపడిపోయాను.

ఇప్పుడున్న దర్శకులతో పని చేయడం ఎలా అనిపిస్తుంది?
ఒకప్పుడు దర్శకులు సిట్యువేషన్ గానీ, కాన్సెప్ట్ గానీ చెప్పి ట్యూన్ కావాలని అనేవారు. కానీ ఇప్పుడు వస్తున్న చాలా మందికి అది తెలియడం లేదు. సీన్స్ గురించి చెప్తారు. కానీ సీన్‌లో ఏం చెప్పాలని అనుకుంటారు.. దాని కాన్సెప్ట్ ఏంటి? ఎలాంటి పాట కావాలని చెప్పలేకపోతోన్నారు.. సినిమా కాన్సెప్ట్‌ని కూడా మాకు సరిగ్గా వివరించలేక పోతోన్నారు. కాన్సెప్ట్ చెప్తే గానీ ఓ లిరిసిస్ట్ సాహిత్యాన్ని రాయలేడు, నేను ట్యూన్ ఇవ్వలేను.

మ్యూజిక్ విషయంలో క్రెడిట్స్ మిస్ అవ్వడం, వేరే వాళ్లకి క్రెడిట్స్ వెళ్లడంపై మీ అభిప్రాయం ఏంటి?
‘ఆయ్’ విషయంలో నాకు అలాంటి ఓ పరిస్థితి వచ్చింది. రామ్ మిర్యాల గారు కూడా రెండు పాటలు ఇచ్చారు. మిగతాది అంతా నేను చేశాను. కానీ పేరు మాత్రం ఆయనదే కనిపించేది. మీడియాలో అలా తప్పుగా వెళ్లింది. అందుకే ప్రతీ ఈవెంట్‌లో బన్నీ వాస్ గారు నా పేరుని చెబుతూ ఉండేవారు. మీడియాలో కొన్ని చోట్ల అలా వచ్చిన దాన్ని బన్నీ వాస్ గారు కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. రీసెంట్‌గా ‘సేవ్ ది టైగర్స్’ టైంలో నా పేరు కాకుండా ఎవరి పేరో కనిపించింది. నేను మాత్రం నా టీంలో ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ ఇస్తాను.

పదేళ్ల జర్నీపై మీరు సంతృప్తిగా ఉన్నారా?
పేరుకి పదేళ్లు అయినా మధ్యలో చాలా టైంని కరోనా తినేసింది. నా ఈ జర్నీలో నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. ఎలాంటి సినిమాకి అయినా మ్యూజిక్ ఇవ్వగలను. పెద్ద కమర్షియల్ మూవీకి కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగలను. ఈ పదేళ్లలో నేను ఈ కాన్ఫిడెన్స్‌ను సంపాదించుకున్నాను. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?

తమిళ నిర్మాణ సంస్థలో మౌళి కొత్త ప్రయాణం?

తమిళ నిర్మాణ సంస్థలో మౌళి కొత్త ప్రయాణం?

ట్యాగ్లు
అజయ్‌ అరసాడతెలుగు‌ సంగీత దర్శకుడుఆయ్వికటకవిసేవ్‌ ది‌ టైగర్స్పవన్‌ కళ్యాణ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మనీలా పర్యటనలో ప్రధాని మోదీ
రాజకీయాలు

మనీలా పర్యటనలో ప్రధాని మోదీ

తల్లిదండ్రుల ప్రేమకథకు వేదికైన కేంబ్రిడ్జ్‌ రెస్టారంట్‌ను గుర్తుచేసుకున్న రాహుల్‌
జనరల్

తల్లిదండ్రుల ప్రేమకథకు వేదికైన కేంబ్రిడ్జ్‌ రెస్టారంట్‌ను గుర్తుచేసుకున్న రాహుల్‌

మొటిమలు, చర్మ సమస్యలకు పసుపు ఎలా ఉపయోగపడుతుంది? నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మొటిమలు, చర్మ సమస్యలకు పసుపు ఎలా ఉపయోగపడుతుంది? నిపుణుల సూచనలు

ఆంధ్ర తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక
జనరల్

ఆంధ్ర తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక

రాజకీయ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ.. ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి
రాజకీయాలు

రాజకీయ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ.. ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..
జనరల్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం
జనరల్

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ
జనరల్

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?
క్రీడలు

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
జనరల్

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!