
జనరల్

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై, అనంతరం బీజేపీలో చేరిన నేతలకు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం బీజేపీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు కూడా చోటు కల్పించింది.
అంతేకాకుండా, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ రూపొందించేందుకు మరో కమిటీని కూడా బీజేపీ ఏర్పాటు చేసింది. ఆప్ నుంచి బీజేపీలోకి మారిన రాజ్యసభ సభ్యులందరికీ ఈ రెండు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహాలను సిద్ధం చేసే క్రమంలో వారికి కీలక పాత్రలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!