
రాజకీయాలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఎక్కువ సమయం పనిచేయలేకపోతున్నానని, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని గడ్కరీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన రాజకీయాలకు వీడ్కోలు పలకబోతున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ ప్రచారంపై స్పందించిన గడ్కరీ.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. తన వయసును దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలు చేశానని, కార్యక్రమాలకు యువతను ఆహ్వానించాలని మాత్రమే సూచించానని వివరించారు. అయితే, తన మాటలను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా కొన్ని మీడియా కథనాలు ప్రచురించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!