
క్రీడలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ గ్రామీణ క్రీడా నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీమియర్ షోలు విశేష స్పందనను దక్కించుకున్నాయి.
కర్ణాటకలో ప్రత్యేక ప్రదర్శనల ద్వారానే ఈ చిత్రం సుమారు రూ.3.02 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప 2’, ‘ఓజీ’ వంటి పెద్ద సినిమాల ప్రీమియర్ వసూళ్లను కూడా అధిగమించినట్లు సమాచారం. రామ్ చరణ్ క్రేజ్‌తో పాటు శివరాజ్ కుమార్ ప్రభావం కూడా ఈ విజయానికి కారణమని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!