

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నాయక్’ సినిమా తన కెరీర్‌కు ఎలా కీలక మలుపు తీసుకువచ్చిందో వివరించారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తన సినీ ప్రయాణంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలిపారు. మొదట మూడు రోజుల షూటింగ్ కోసం మాత్రమే తనను ఆహ్వానించినప్పటికీ, యూనిట్ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందనతో తన పాత్రను విస్తరించినట్లు చెప్పారు.
మూడు రోజుల పాత్ర చివరకు 17 నుంచి 18 రోజుల షూటింగ్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు చిరంజీవి తన సన్నివేశాలను చూసి ఎంతో ఆనందించి, ఒక్క సీన్ కూడా కట్ చేయొద్దని సూచించారని తెలిపారు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుత స్పందనతో వారం రోజుల్లోనే 36 సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని పోసాని వెల్లడించారు. ‘నాయక్’ తన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచే చిత్రమని ఆయన అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!