

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (NEHS)’ను అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు దాదాపు 29.8 లక్షల మంది లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందనున్నారు. సీజీహెచ్ఎస్ ప్యాకేజీల కింద 1,816 రకాల వైద్య సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి.
సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన దాదాపు రూ.10 వేల కోట్ల వైద్య బిల్లులను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!