

సినీ పరిశ్రమలో భారీ అంచనాలతో ప్రారంభమైన సినిమాలు, అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో లేకపోతే మధ్యలోనే నిలిపివేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి పరిణామం విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా చోటుచేసుకుంది. 2019లో విడుదలైన డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో, ఆయన ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘హీరో’ అనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రం ప్రారంభించారు. ఇందులో మాళవిక మోహనన్, శాలిని పాండే హీరోయిన్లుగా ఎంపికయ్యారు.
ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించి, తొలి షెడ్యూల్‌కు సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. అయితే అవుట్‌పుట్‌పై విజయ్ పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో స్క్రిప్ట్ మార్పులపై చర్చలు జరిగినా, దర్శకుడు అందరినీ ఒప్పించలేకపోయాడని సమాచారం. అనంతరం ఈ ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ‘రణబాలి’ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!