

భారతీయ సినీ చరిత్రలో రజనీకాంత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ బస్సు కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన. నటుడు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు సహా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. చివరకు ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత శివాజీ గైక్వాడ్ నుంచి రజనీకాంత్‌గా రూపాంతరం చెందారు. కె. బాలచందర్ దర్శకత్వంలో తొలి దశలో ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన. ‘భైరవి’తో కథానాయకుడిగా ఎదిగి అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమంలో రజనీకాంత్ అనే పేరు భారతీయ సినిమాలోనే ఒక బ్రాండ్‌గా మారింది.
నటుడిగా ఐదు దశాబ్దాలకు పైగా ప్రయాణం సాగించిన రజనీకాంత్. ఇప్పుడు తన జీవిత కథను పుస్తక రూపంలోకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ఆయన కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ.. తన తండ్రి జీవిత చరిత్ర అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని, భగవద్గీత, మహాభారతం తరహాలో విస్తృతమైన స్థాయిలో ఉంటుందని తెలిపారు. ముందుగా దీనిని పుస్తకంగా విడుదల చేసి, ఆ తర్వాత వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తామని ఆమె వెల్లడించారు. మరో కుమార్తె సౌందర్య రజనీకాంత్ కూడా దీనిని సినిమాగా రూపొందించే ఆలోచన ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!