

టాలీవుడ్‌లో యంగ్ హీరోలు కొత్త రూట్‌లో ప్రయాణిస్తున్నారు. నటనతో పాటు తమలోని ఇతర ప్రతిభను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రామ్ పోతినేని ఇప్పటికే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లో పాటల రచయితగా, సింగర్‌గా తనలోని మరో కోణాన్ని చూపించగా.. ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. తన 23వ ప్రాజెక్ట్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇక కిరణ్ అబ్బవరం కూడా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతూనే దర్శకత్వం వైపు దృష్టి సారిస్తున్నాడు. తన 13వ సినిమాకు మెగాఫోన్ పట్టబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందనుందని తెలుస్తోంది. మరోవైపు కార్తీకేయ గుమ్మకొండ కూడా ‘కమ్ బ్యాక్’ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలోని యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. కార్తీకేయ స్వయంగా రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!