
జనరల్

ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కుమారుడు సాయి హర్ష సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీకాంత్ కుమార్తె మేధ కథానాయికగా పరిచయమవుతున్న ‘మైత్రి ఇన్ లవ్’ చిత్రంతో సాయి హర్ష సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ముహూర్తం జరుపుకుంది. దీంతో ఈ సినిమా ద్వారా మేధతో పాటు సాయి హర్ష కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.
ఈ విషయాన్ని రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రంతో తన కుమారుడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడని తెలిపారు. వినయం, అణకువ కలిగిన సాయి హర్షకు సంగీతమంటే ఎంతో ఇష్టమని పేర్కొంటూ, అతడిని ఆశీర్వదించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. ‘మైత్రి ఇన్ లవ్’ చిత్రంపై ఈ ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!