
రివ్యూలు

1934లో విడుదలైన క్లాసిక్ చిత్రం సీతలో దిగ్గజ నటుడు పృథ్వీరాజ్ కపూర్ శ్రీరాముడి పాత్రను పోషించి సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. దాదాపు వందేళ్ల తర్వాత ఆయన మునిమనవడు రణ్‌బీర్ కపూర్, దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో శ్రీరాముడి పాత్రలో నటిస్తూ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
నాలుగు తరాలుగా కొనసాగుతున్న కపూర్ కుటుంబ సినీ వారసత్వానికి ఇది మరో చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. పృథ్వీరాజ్ కపూర్ పోషించిన పాత్రనే ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ పోషించనున్న నేపథ్యంలో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ అరుదైన అనుబంధాన్ని బాలీవుడ్‌లో చారిత్రక మైలురాయిగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!