

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా మోదీకి అనుకూలంగా లేని వారి పేర్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటర్లు మోదీని ఎన్నుకోవడం లేదని, ఆయనే సర్ ప్రక్రియ ద్వారా తనకు అనుకూలమైన ఓటర్లను ఎంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఆయన బాధ్యత వహించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఖర్గే స్పష్టం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ప్రయోగించి ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా తాము భయపడబోమని, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అధికారం నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే తమ ఆరోపణలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!