

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలైంది. మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేసిన సువేందు అధికారి.. మరోసారి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించిన మమతా బెనర్జీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్ మద్దతు కోరుతున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో తన చేతిలో మమతా బెనర్జీ రెండుసార్లు ఓడిపోయారని సువేందు అధికారి వ్యాఖ్యానించారు. ఆమె సొంత పోలింగ్ బూత్‌తో పాటు, ఆమె ప్రాతినిధ్యం వహించిన వార్డులోనూ ఓటమి ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ధైర్యముంటే మరోసారి తనపై పోటీ చేయాలని, ఈసారి కూడా ఓడిస్తానని సవాల్ చేశారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఎన్నికల సంఘమే కారణమని మమతా బెనర్జీ ఆరోపిస్తూ, ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో సువేందు వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలతో మమతా బెనర్జీ రాజకీయ సమీకరణాలపై చర్చలు జరుపుతున్నారనే ప్రచారం కూడా ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!