

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ నుంచి రణ్‌బీర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో రణ్‌బీర్ పాతకాలపు కారులో డ్రైవ్ చేస్తూ రెట్రో లుక్‌లో కనిపించాడు. లేత రంగు దుస్తులు, గ్లాసెస్‌తో సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ.. రక్తంతో గాయపడిన అతడి చేయి మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘లవ్ అండ్ వార్’ ప్రధాన చిత్రీకరణ ఈ నెలలో పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. యుద్ధ సన్నివేశాలకు సంబంధించి రణ్‌బీర్, అలియా, విక్కీతో అదనపు చిత్రీకరణ జరిగినట్లు కూడా సమాచారం. ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ భాగస్వామిగా ఉంది. డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!