

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రంగా దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రష్మిక హాజరుకాకపోవడంతో ఆమె ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె కార్యక్రమానికి రాలేకపోయారని విజయ్ దేవరకొండ స్పష్టం చేసినట్లు సమాచారం.
రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్‌తో పాటు రష్మిక కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న రెండో చిత్రం ‘రణబాలి’. ప్రముఖ సంగీత ద్వయం అజయ్–అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!