
సినిమాలు

మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత ఈ రిలీజ్ డేట్ అప్‌డేట్‌ను విడుదల చేశారు.

భక్తి భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ ఇందులో ప్రేమాభిమానాలు కలిగిన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగ కథతో సినిమా రూపొందుతోందని చిత్ర బృందం చెబుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!