

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో RAW NTR వ్యవస్థాపకుడు సాయిరూప్ మాట్లాడుతూ, తమ సంస్థ పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటైన రిజిస్టర్డ్ ఎన్జీఓ అని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని స్పష్టం చేశారు. ‘ఊరు–వాడ’ కార్యక్రమంలో యువతలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, గ్రామాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తొలి దశలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, దాంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని సాయిరూప్ అన్నారు. తమ సంస్థ సుమారు రూ.100 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలను CSR నిధులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. గత మూడేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నామని, అయితే తమ లక్ష్యం సేవ మాత్రమేనని, రాజకీయాలకు లేదా ఎలాంటి బృందాలకు తాము సంబంధించిన వారు కాదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!