

బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రొమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు వెణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘రాధా రమణ’ పాటకు మంచి స్పందన రాగా, తాజాగా మేకర్స్ ‘రొమాంచకం’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
వాసుకి వైభవ్ స్వరపరిచిన ఈ టైటిల్ సాంగ్‌ను ఆయనే ఆలపించారు. క్యాచీ బీట్‌తో పాటు మెలోడీని మేళవించిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. తొలి ప్రేమలోని కొత్త అనుభూతులు, ప్రేమికుల మధ్య చోటుచేసుకునే అందమైన క్షణాలను పాట ఆకట్టుకునేలా ఆవిష్కరిస్తోంది. ప్రేమ, కామెడీ, సస్పెన్స్ అంశాల మేళవింపుతో ‘రొమాంచకం’ తెరకెక్కింది. ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!