
సినిమాలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలను గమనిస్తే సమంత ఈ సినిమాలో యాక్షన్ ప్రధానమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. U/A సర్టిఫికెట్ రావడంతో సినిమాలో యాక్షన్, భావోద్వేగాలు సమతూకంగా ఉండనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సమంత మాస్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!