

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన చిన్న ప్రమాదంలో ఎన్టీఆర్‌కు గాయం కావడంతో ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ ఆగకుండా ఉండేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేని సన్నివేశాల చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్‌లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ చిత్రంలో అనిల్ కపూర్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో కనిపించనున్నారు. కథలో కీలక మలుపు తిప్పే ఈ పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ కోలుకుని సెట్స్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన, అనిల్ కపూర్‌ల మధ్య హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!