

హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద స్థాయిలో వివక్ష జరుగుతోందని ఆరోపించారు. థియేటర్ల కేటాయింపులో రాజకీయాలు పనిచేస్తున్నాయని, చిన్న చిత్రాలకు సరైన అవకాశాలు ఇవ్వకుండా చివరి నిమిషంలో షోలు, స్క్రీన్లు తగ్గిస్తున్నారని అన్నారు. దీంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టికి చేరకముందే నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ విడుదల సమయంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని షెరాజ్ తెలిపారు. థియేటర్లతో పాటు ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కులు, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లో చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. పరిస్థితులు మారకపోతే ఇతర భాషా పరిశ్రమల్లో పనిచేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!