

సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వాన్’పై బాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జానపద కథల ఆధారంగా రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీతో పాటు విడుదలైన పోస్టర్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. దట్టమైన అడవి మధ్య త్రిశూలాన్ని పట్టుకున్న యోధుడు, ఎదురుగా ఉగ్రరూపంలో కనిపిస్తున్న పులి, దూసుకొస్తున్న ఎద్దు వంటి దృశ్యాలు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి.
విజువల్ పరంగా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ మోషన్ పిక్చర్స్ సంస్థలు తొలిసారి కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడం విశేషంగా మారింది. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణభ్ కుమార్, నీరజ్ కొఠారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జానపద కథాంశం, ఫాంటసీ అంశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది. విడుదలకు ముందే మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!