
జనరల్

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న తాజా థ్రిల్లర్ చిత్రం ‘ది వాన్’. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ‘ది వాన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను పరిశీలిస్తే ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఓ గ్రామానికి సమీపంలోని అడవిని ప్రధాన నేపథ్యంగా తీసుకుని కథను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అడవిలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!