

ఇటీవల విడుదలైన రవితేజ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తండ్రి, కూతురి అనుబంధం నేపథ్యంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరోవైపు సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం కూడా అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మైలురాయిని దాటిన ఇరుముడి ఓవర్‌సీస్ వసూళ్లలో మాత్రం మా ఇంటి బంగారం కంటే వెనుకబడింది. ఓవర్‌సీస్ మార్కెట్‌లో రామ్ చరణ్ పెద్ది రూ.53 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, మనశంకరవరప్రసాద్‌గారు రూ.43 కోట్లతో రెండో స్థానంలో, ది రాజాసాబ్ రూ.34 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. సమంత మా ఇంటి బంగారం రూ.28 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, రవితేజ ఇరుముడి రూ.22 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తంగా ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు దాటినా, ఓవర్‌సీస్ మార్కెట్‌లో మాత్రం సమంత సినిమాతో పోలిస్తే వెనుకబడి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!