

టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భావోద్వేగభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా, థియేటర్లలో విడుదలైన తర్వాత ట్రైలర్‌ను విడుదల చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా, తాజాగా స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా స్పందించారు. ‘సింగ్ గీతం’ తన హృదయాన్ని కదిలించిందని ఆయన పేర్కొన్నారు. 94 ఏళ్ల వయసులోనూ సృజనాత్మకతతో పరిశ్రమకు స్ఫూర్తిగా నిలుస్తున్న సింగీతం శ్రీనివాసరావును ఎన్టీఆర్ ప్రత్యేకంగా కొనియాడారు. సింగీతం గారి కలను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత నాగ్ అశ్విన్‌కు అభినందనలు తెలిపారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం చిత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు. సినిమా విడుదల తర్వాత ట్రైలర్ విడుదల చేసిన వినూత్న మార్కెటింగ్ విధానాన్ని కూడా ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!