11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

Writer: Chandrika 07:20 AM, 11 అక్టోబర్, 2026
దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

వైవిధ్యమైన దర్శకత్వం, విలక్షణమైన నటన, ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్‌జే సూర్య. నటుడు కావాలనే కలతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, తొలుత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. విజయ్‌తో తమిళంలో తెరకెక్కించిన ‘ఖుషి’ విజయవంతం కావడంతో పాటు, పవన్‌ కళ్యాణ్‌తో రూపొందించిన తెలుగు వెర్షన్‌ కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఆయనకు స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ‘న్యూ’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు భాగ్యరాజ్‌ వద్ద శిష్యుడిగా చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను కూడా సూర్య గుర్తుచేసుకున్నారు. తనను శిష్యుడిగా చేర్చుకోవాలని పట్టుబడుతూ ఒకసారి భాగ్యరాజ్‌ కారు ముందు నిలబడ్డానని తెలిపారు. అనంతరం వసంత్‌, సభాపతి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, అజిత్‌ కుమార్‌తో తెరకెక్కించిన ‘వాలి’ సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం తన కెరీర్‌కు బలమైన పునాది వేసిందని చెప్పారు.

తమిళనాడులోని వాసుదేవనల్లూరుకు చెందిన ఎస్‌జే సూర్య చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. పదో తరగతిలోనే ఇంట్లో లేఖ రాసి చెన్నైకి వెళ్లి సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు. డిగ్రీ పూర్తయినా సినిమా ప్రయత్నాలను కొనసాగించిన ఆయన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా హోటల్‌లో వెయిటర్‌గా కూడా పనిచేశారు. దాదాపు ఆరేళ్లపాటు అవకాశాల కోసం ఎదురుచూసిన తర్వాత, ముందుగా దర్శకుడిగా పేరు సంపాదించి, ఆ తర్వాత నటుడిగా తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘న్యూ’ సినిమా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినా, మహేశ్‌బాబు హీరోగా తెలుగులో తెరకెక్కించిన ‘నాని’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా సరిగా ఆడకపోవడం ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని, మహేశ్‌బాబుకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించాలని ఉందని సూర్య వెల్లడించారు. ప్రస్తుతం విభిన్న పాత్రల్లో, ముఖ్యంగా ప్రతినాయకుడిగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన, త్వరలో ‘జైలర్‌ 2’తో మరోసారి అలరించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

ట్యాగ్లు
ఎస్‌జే సూర్యతమిళ సినిమాతెలుగు సినిమాఖుషి సినిమావాలి సినిమాన్యూ సినిమానాని సినిమామహేశ్‌బాబుపవన్ కళ్యాణ్జైలర్‌ 2
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి
సినిమాలు

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...
జనరల్

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...
సినిమాలు

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే
సినిమాలు

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..
జనరల్

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య
సినిమాలు

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?
క్రీడలు

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...
రాజకీయాలు

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’
జనరల్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?
జనరల్

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!
జనరల్

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!