
క్రీడలు

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ చిత్రంపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా టీజర్‌ను జూన్ 8 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టీజర్ ద్వారా కథా నేపథ్యం, ప్రధాన పాత్రలను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!