

శోభిత ధూళిపాళ మరోసారి తన అద్భుతమైన నటనతో పాటు ప్రత్యేకమైన అభిరుచితో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో' వెబ్‌సిరీస్‌లో ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. హైదరాబాద్ నగరాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిన ఈ కథలో వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే పాత్రలో శోభిత సహజ నటనతో మెప్పించింది. ఇప్పటికే గూఢచారి, మేజర్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, ఈ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. విభిన్న కథలు, బలమైన పాత్రలను ఎంచుకునే ఆమె అభిరుచి మరోసారి స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల గోవాలో గడిపిన విహారయాత్ర సందర్భంగా శోభిత పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్ నేపథ్యంలోనూ సంప్రదాయ చేనేత చీరలో కనిపిస్తూ ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. క్రీమ్ రంగు చీరకు ఊదా అంచు, అందుకు తగ్గ బ్లౌజ్, ముత్యాల హారం, బంగారు ఆభరణాలు, చేతినిండా గాజులు, నుదుట ఎర్రటి బొట్టుతో ఆమె లుక్‌కు అభిమానుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ శోభిత తన ప్రత్యేక సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!