

టామ్ హాలండ్ హీరోగా నటించిన ‘స్పైడర్ మ్యాన్’ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. శనివారం సుమారు రూ.84 కోట్లు, ఆదివారం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు నమోదు కావడంతో ఈ మైలురాయిని అందుకున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, సినిమా రూ.8,842 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అవెంజర్స్: ఎండ్ గేమ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లోనే భారత్‌లో రూ.500 కోట్ల మార్క్ కూడా దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం జూలై 30న భారత్‌లో అమెరికా కంటే ఒక రోజు ముందుగానే విడుదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!