

‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే కొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం సరదా సన్నివేశాలు, హాస్యంతో నిండిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
టీజర్‌లో శ్రీ విష్ణు, అతడి కుటుంబానికి సంబంధించిన భిన్నమైన జీవనశైలిని పరిచయం చేశారు. ఇందులో అర్జున్ పాత్రలో కనిపిస్తున్న శ్రీ విష్ణు.. తన సీనియర్ కుమార్తెతో ప్రేమలో పడతాడు. ఆ పాత్రను సాక్షి మధోల్కర్ పోషించారు. ఈ రెండు కుటుంబాలు కలిసినప్పుడు చోటుచేసుకునే సరదా సంఘటనలను టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, రంగులీనే విజువల్స్, బలమైన సహాయ నటీనటుల బృందం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇటీవల గుర్తింపు ఆధారిత అంశాలతో తెరకెక్కుతున్న సినిమాల ట్రెండ్‌పై కూడా టీజర్ చివర్లో సరదాగా సెటైర్ వేశారు. నరేశ్, అభిరామి, గురు సోమసుందరం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!