

చిరంజీవి, ప్రభాస్, నందమూరి బాలకృష్ణ వంటి టాలీవుడ్ అగ్ర కథానాయకులు ప్రస్తుతం తమ భారీ చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రాల్లో యాక్షన్ ఘట్టాల చిత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేలా అత్యాధునిక సాంకేతికతతో, భారీ సెట్ల మధ్య సాహస సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో భారీ పోరాట ఘట్టాలు తెరకెక్కుతున్నాయి. అలాగే చిరంజీవి తన 158వ చిత్రంలో కొన్ని క్లిష్టమైన స్టంట్లను స్వయంగా చేయడానికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకేసారి ముగ్గురు అగ్రనటులు యాక్షన్ ప్రధాన చిత్రాలతో రానుండటంతో టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!