

భారతదేశంలో తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ అయిన సైన్ లబాన్ హైదరాబాద్‌లో బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు అవుట్‌లెట్లను ప్రారంభించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ రాశి సింగ్ ఈ అవుట్‌లెట్లను ప్రారంభించి, హైదరాబాద్ ప్రజలు కొత్త రుచులను ఎప్పుడూ ఆదరిస్తారని, సైన్ లబాన్ ప్రత్యేక ఈజిప్షియన్ డెజర్ట్స్ కూడా మంచి ఆదరణ పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేరళలో ప్రారంభమైన సైన్ లబాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 64 అవుట్‌లెట్లకు విస్తరించినట్లు సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి డెజర్ట్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ సేవలు ప్రారంభించామని, భవిష్యత్తులో నగరంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ఫుడ్ బ్లాగర్లు, వ్యాపారవేత్తలు, డెజర్ట్ ప్రియులు ప్రత్యేక రుచులను ఆస్వాదించి ప్రశంసించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!