
జనరల్

ఈ సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో హీరో నవీన్ పొలిశెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో తొలి ₹100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ విజయోత్సాహంలో ఆయన తదుపరి చిత్రానికి తమిళ దర్శకుడు ఆంటోని భాగ్యరాజ్‌తో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కొత్త కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నవీన్ తన విజయ పరంపరను కొనసాగించేందుకు ఈ చిత్రం కీలకంగా మారే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!