
జనరల్

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో కొన్ని సినిమాలను వదులుకున్నానని, వాటిలో ‘నువ్వే కావాలి’ మరియు ‘దేశముదురు’ చిత్రాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ‘నువ్వే కావాలి’ సినిమాను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని, ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుందని పేర్కొన్నారు.
అలాగే ‘దేశముదురు’ సినిమా కథను దర్శకుడు పూరి జగన్నాథ్ తనకు వినిపించినప్పటికీ, అప్పట్లో అంగీకరించలేదని చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత చూసినప్పుడు, ఆ పాత్రకు అల్లు అర్జున్ ఎంతో బాగా సరిపోయారని అభిప్రాయపడ్డారు. తాను చేసి ఉంటే ఆ స్థాయి విజయాన్ని సాధించేదో కాదో చెప్పలేనని, అందుకే ఆ సినిమా వదిలేసినందుకు పెద్దగా బాధపడనని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!