
జనరల్

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ ఇటీవల ‘బోర్డర్-2’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పేరు మొదట ‘లాహోర్ 1947’ కాగా, తాజాగా దీన్ని అధికారికంగా ‘బట్వారా 1947’గా మార్చారు. ఈ సినిమాను అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు.
ఈ కొత్త టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా సన్నీ డియోల్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆగస్టు 14, 2026న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. భారత విభజన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షబానా అజ్మీ, అలీ ఫజల్, కరణ్ డియోల్, ప్రీతి జింటా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!