
జనరల్

రీల్ లైఫ్ జోడీగా మొదలై రియల్ లైఫ్ సోల్‌మేట్స్‌గా మారిన సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ ప్రేమకు గుర్తుగా పిల్లలు దియా, దేవ్‌ల సమక్షంలో విదేశాల్లోని ఓ చర్చిలో ఈ స్టార్ కపుల్ మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతిక తెల్లటి వెడ్డింగ్ గౌన్‌లో మెరిసిపోగా, ఆమెను చూసిన సూర్య భావోద్వేగానికి గురయ్యారు.
ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా తల్లి చేయి పట్టుకుని కొడుకు దేవ్ నడిపిస్తున్న దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో సూర్య, జ్యోతిక తమ ప్రేమను మరోసారి చాటుకున్న ఈ క్యూట్ ఫ్యామిలీ మూమెంట్‌పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!