20, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌, హరీశ్‌ రావుకు రేవంత్‌ రెడ్డి సవాల్...అసెంబ్లీకి రండి, చర్చిద్దాం

Writer: Pooja 11:54 PM, 19 నవంబర్, 2026
కేసీఆర్‌, హరీశ్‌ రావుకు రేవంత్‌ రెడ్డి సవాల్...అసెంబ్లీకి రండి, చర్చిద్దాం

సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట రాజకీయ చరిత్రను ప్రస్తావిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అనంతుల మదన్‌మోహన్‌ సేవలను గుర్తుచేశారు. 1983 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ జెండా ఎగురవేసిన ఘనత మదన్‌మోహన్‌కే దక్కుతుందని అన్నారు. ఆయన పేరును చరిత్ర నుంచి చెరిపివేసేందుకు కేసీఆర్‌, హరీశ్‌ రావు ప్రయత్నించారని ఆరోపించారు. సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి మదన్‌మోహన్‌ పేరు పెట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించారు. రాజకీయంగా అవకాశం కల్పించిన నాయకులకే కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. హరీశ్‌ రావు రాజకీయ ఎదుగుదలపైనా వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేసే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. 2029లో కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని, 2034 వరకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల పెరుగుదలపై కూడా రేవంత్‌ రెడ్డి ప్రశ్నలు సంధించారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఆర్థిక పరిస్థితులను ప్రస్తావిస్తూ.. బీఆర్‌ఎస్‌ నేతల ఆస్తులతో పోలిస్తే వారి పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉందని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, కేటీఆర్‌, హరీశ్‌రావు బంధువుల ఆస్తులపై కూడా పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్‌ తన కుమారుడు, అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చి, కుమార్తెను ఎంపీగా గెలిపించుకున్నారని.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం శంకరమ్మను మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమించిందని, చాకలి ఐలమ్మ మనుమరాలికి కూడా మహిళా కమిషన్‌లో స్థానం కల్పించామని తెలిపారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌ రావు పాత్రపై ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ.. ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్‌, హరీశ్‌ రావు, కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. బతుకమ్మ చీరల పంపిణీలోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, హరీశ్‌ రావు, కేటీఆర్‌, సంతోష్‌రావులను ప్రస్తావిస్తూ.. వీరి పాలన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, ఎన్ని రాజకీయ వేషాలు వేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మరని వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్‌రెడ్డి వివరించారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పేదలకు కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. మూడేళ్లలో ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని, వ్యవసాయ రంగానికి రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. సన్న వడ్లకు బోనస్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ప్రజలు బానిసత్వ పాలన కావాలో, ప్రజా పాలన కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ.. 2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిద్దిపేటలో సీఎం ప్రసంగంపై హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు

సిద్దిపేటలో సీఎం ప్రసంగంపై హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు

అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి

అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి

ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి

ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి

కుల గణనకు వైఎస్సార్‌సీపీ మద్దతు.. వైఎస్ జగన్ కీలక ప్రకటన

కుల గణనకు వైఎస్సార్‌సీపీ మద్దతు.. వైఎస్ జగన్ కీలక ప్రకటన

నాలుగు రోజుల్లో మూడోసారి.. కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి

నాలుగు రోజుల్లో మూడోసారి.. కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

ట్యాగ్లు
రేవంత్‌ రెడ్డిసిద్దిపేట బహిరంగ సభకేసీఆర్హరీశ్‌ రావుతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్‌, హరీశ్‌ రావుకు రేవంత్‌ రెడ్డి సవాల్...అసెంబ్లీకి రండి, చర్చిద్దాం
రాజకీయాలు

కేసీఆర్‌, హరీశ్‌ రావుకు రేవంత్‌ రెడ్డి సవాల్...అసెంబ్లీకి రండి, చర్చిద్దాం

సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్ఓ ఆమోదం
బిజినెస్

సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్ఓ ఆమోదం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 74: డిక్టేటర్స్ గేమ్స్‌లో త్రిగుణ్ టీమ్ ఆధిపత్యం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 74: డిక్టేటర్స్ గేమ్స్‌లో త్రిగుణ్ టీమ్ ఆధిపత్యం

సిద్దిపేటలో సీఎం ప్రసంగంపై హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

సిద్దిపేటలో సీఎం ప్రసంగంపై హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు

గచ్చిబౌలిలోని పీజీ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం
జనరల్

గచ్చిబౌలిలోని పీజీ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం

‘భోగి’ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘భోగి’ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ చైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘చలో పధవే’ సాంగ్ విడుదల..
సినిమాలు

నాగ చైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘చలో పధవే’ సాంగ్ విడుదల..

అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి
రాజకీయాలు

అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి

గేమింగ్ ప్రపంచంలో GTA 6 సంచలనం
టెక్నాలజీ

గేమింగ్ ప్రపంచంలో GTA 6 సంచలనం

ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి
రాజకీయాలు

ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి

చైత్యభూమిగా మారిన దాదర్ మెట్రో స్టేషన్ పేరు
జనరల్

చైత్యభూమిగా మారిన దాదర్ మెట్రో స్టేషన్ పేరు

ఏఐ బూమ్ వేళ భారత బ్రాండ్లకు ఎదురుదెబ్బ
బిజినెస్

ఏఐ బూమ్ వేళ భారత బ్రాండ్లకు ఎదురుదెబ్బ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!