
జనరల్

స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం తన 63వ చిత్రం ‘చియాన్ 63’తో బిజీగా ఉన్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా చిత్రీకరణను 80 రోజుల షెడ్యూల్‌లో పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించింది.
ఈ చిత్రాన్ని 2026 క్రిస్మస్ లేదా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమాలో విక్రమ్‌ను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్‌లో చూపించనున్నట్లు సమాచారం. రియా శిబు, ఊర్వశి, ఎం.ఎస్. భాస్కర్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!