
సినిమాలు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జ్యూరీ ఎంపిక ప్రక్రియ పూర్తయిందని సమాచారం ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో విజేతల పేర్ల కోసం ఉత్కంఠ మరింత పెరిగింది. ఈసారి 2024లో సెన్సార్ ధ్రువీకరణ పొందిన చిత్రాలనే పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఉత్తమ నటుడి విభాగంలో మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, అల్లు అర్జున్ పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా, ఉత్తమ నటి విభాగంలో సాయి పల్లవి బలమైన పోటీదారుగా ప్రచారంలో ఉంది. సాంకేతిక విభాగాల్లో ‘కల్కి 2898 ఏడీ’, ‘అమరన్’, ‘దేవర’ చిత్రాలు పోటీలో నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇవన్నీ అంచనాలుగానే మిగిలిపోతాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!