

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొనబోతోంది. ఈ ఏడాది గాంధీ జయంతి శుక్రవారం రావడంతో లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ ఎలాంటి వాయిదా లేకుండా విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’, రాజమౌళి సమర్పిస్తున్న ఫహద్ ఫాసిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’తో పాటు ‘తెల్ల కాగితం’, ‘సమ్మర్ హాలిడేస్’ వంటి చిన్న చిత్రాలు కూడా ఇదే రేసులో ఉన్నాయి. దసరాకు శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ధనుష్ ‘ఓమ్’ వంటి భారీ చిత్రాలు వస్తుండటంతో మీడియం బడ్జెట్ సినిమాలు అక్టోబర్ 2పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి వీకెండ్‌లో పోటీ ఆసక్తికరంగా ఉండనుండగా, వెంకీ సినిమాను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలవడం మిగతా చిత్రాలకు సవాల్‌గా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!