

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం కేరళంలోని ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నాలాంబలం యాత్రలో ప్రముఖ క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయంలో ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో విశిష్ట సేవగా పేరున్న దీపారాధనలో పాల్గొని స్వయంగా దీపాలు వెలిగించారు. అనంతరం మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ పాల్గొన్నారు. శ్రీరామస్వామి వారి దర్శనంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామిని కూడా దర్శించుకున్నారు.
శ్రీరామస్వామి, శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామికి పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గర్భాలయంలోని దక్షిణామూర్తి, వినాయకుడు, అనంతపద్మనాభ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న తీర్వా నదిలో చేపలకు ఆహారం అందించే మీనుట్టు సేవలో పాల్గొన్నారు. అనంతరం వేది వజిపాడు సేవలో భాగంగా 1,001 టపాసులు పేల్చేందుకు అయ్యే మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరగా శాస్తాగా భక్తులు కొలిచే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామన్ తిరుమేని పవన్ కళ్యాణ్‌కు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!